తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకనో కొత్త గవర్నర్ ను మొదటి నుండీ శత్రువుగానే చూస్తున్నారు. తనకు అనుకూలమైన గవర్నర్ ను తప్పించి బీజేపీ నాయకురాలని గవర్నర్ గా తీసుకువచ్చారని కేసీఆర్ భావిస్తున్నారు. దానితో ప్రతీ పది రోజులకు ఒకసారి గత గవర్నర్ ను కలిసే కేసీఆర్ కొత్త గవర్నర్ కు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
సెప్టెంబర్ 8న ఆవిడ ప్రమాణస్వీకారం చేసిన రోజే కేసీఆర్ ఆమెను కలిశారు. అయితే ఇన్ని రోజుల తరువాత కేసీఆర్ గవర్నర్ తమిళిసైని కలవబోతున్నారు. ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటికీ నుంచి గవర్నర్ను సీఎం కేసీఆర్ ఇంతవరకు కలవలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణం తీసుకోబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు దీనిపై సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న సీఎం కేసీఆర్.. దానిపై కూడా గవర్నర్కు వివరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఆర్టీసీ భవిష్యత్తు పై కేసీఆర్ తీసుకునే నిర్ణయం కోసం కార్మికుల కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఎటువంటి షరతులు లేకుండా సమ్మె చేసిన వారందరినీ విధుల్లోకి తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది
Dallas Kamma Folks Behind Acharya Sales?
Mirchi9.com: Number 2 Telugu Website!