KCR and Etela Rajender Assembly Sessionsఈటెల బిజెపి అభ్యర్థిగా తెలంగాణ ప్రభుత్వానికి ఎదురెళ్లి మరి ఉప ఎన్నికలలో ప్రభుత్వం పై విజయం సాధించి తన వ్యక్తిగత పలుకుబడిని ప్రభుత్వ పెద్దలకు రుచి చూపించాడు. అయితే దాని పర్యవసానంలో భాగంగా ఈటెల ఇప్పుడు ప్రభుత్వ అధికారాన్ని రుచి చూడాల్సి వచ్చింది. తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా అసెంబ్లీ కి హాజరు అయినా ఈటెల రాజేంద్రర్ కు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు మొదలైనా కొద్ది క్షణాలలోనే తమ అధికార దర్పాన్ని పరిచయం చేసింది.

ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మంత్రి ప్రసంగానికి తరచూ అడ్డు తగులుతున్నారని బిజెపి నేతలయినా రాజాసింగ్, రఘునందన్ రావు ల తో పాటు ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చెయవలసిందిగా మంత్రి తలసాని యాదవ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు గాను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి అనుమతించారు. తమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు బిజెపి నాయకులు.

నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ పెద్దలతో అధికార పక్షం వైపు కూర్చున్న ఈటెల ఇప్పుడు “ధర్నాలతో- ఆందోళనలతో” అసెంబ్లీ బయట కూర్చో వలసిరావడం చూస్తే “రాజకీయాలలో ఎప్పుడు – ఏదైనా సాధ్యమే” అన్న సామెత గుర్తు రాక మానదు. “అపన టైం ఆయేగా” అనుకుంటూ వేచి చూడాల్సిన పరిస్థితిలో ఈటెల మద్ధతుదారులు ఉన్నారు.