Telangana BJP2019లో ఏం చెయ్యగలరు? అని భాజపా నాయకులను అడిగితే తెలంగాణాలో జెండా పాతెస్తాం, ఆంధ్రలో ఇరగ దీస్తాం అంటూ ఏమాత్రం తగ్గకుండా గొప్పలు చెప్తారు. ఐతే నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఆ పార్టీ ఎంతో కొంత పటిష్టంగా ఉంది తెలంగాణాలోనే. ఐతే నాయకత్వ లేమి ఆ పార్టీని వెంటాడుతుంది. ఎప్పుడు కేంద్ర క్యాబినెట్కోసమే తాపత్రయ పడే కిషన్ రెడ్డి, ఏమాత్రం స్పూర్తి నింపని లక్ష్మణ్. ఇలా భాజపా దుస్థితికి సవలక్ష కారణాలు. ఎవరైనా పార్టీ మారదలిస్తే బిజెపి వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో వారు వెనకబడిపోతున్నామన్న బావనలో ఉంటున్నారు.

భాజపాలో రేవంత్ రెడ్డి జాయిన్ అవ్వొచ్చు అనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. ఐతే భాజపా నాయకులు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏమీలేవు. ఇలాంటివి లేకపోగా ఎవరైనా పార్టీ మారదలిస్తే బిజెపి వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో వారు వెనకబడిపోతున్నామన్న బావనలో ఉంటున్నారు.

రేవంత్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అని తెలిశాక రేవంత్ ను బిజెపిలోకి రావాలని బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ ఆహ్వానించారని, బిజెపిలో తగు ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే బయట మాత్రం తాను కేవలం మర్యాద పూర్వకంగానే రేవంత్ ను కలిశానని, పెద్దమ్మ గుడికి వచ్చానని , దగ్గర్లోనే రేవంత్ ఇల్లు ఉందని , అందుకే వచ్చానని ఆయన చెబుతున్నారు.

రేవంత్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు బిజెపి నేతలు కలిస్తే మాత్రం ఏమి ఉపయోగం ఉంటుంది? ఇలాంటి వ్యవహార శైలి వల్లే ఆ పార్టీ తెలంగాణాలో ఎదుగుబొదుగు లేకుండా పోతుంది. తెలంగాణాలో భాజపా రైలు ఒక జీవితకాలం లేటు!