Telangana BJP2014 నుండి తెలంగాణా భాజపా ఒక్కటే మాట. తెలంగాణాలో తెదేపాతో పొత్తు ఉండదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొనసాగవచ్చు. దీనిబట్టి భాజపాకు లాభం తప్పితే తెదేపాకు ఎలాంటి లాభం లేనట్టే. ఐతే తెదేపా తెలంగాణా యూనిట్లో ఉన్నట్టుండి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తెరాసతో పొత్తు ఉండొచ్చు అని ఒక వర్గం, కాంగ్రెస్తో పొత్తు కోసం రేవంత్ రెడ్డి వర్గం పోటీ పడుతున్నాయి. ఏరకంగా చూసిన భాజపా ఒంటరి అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దానితో ఉలిక్కిపడి భాజపా పెద్దలు అప్రమత్తం అయ్యారు. ఉన్నట్టుండి భాజపా – తెదేపా సమన్వయ సమావేశం పెట్టించారు కూడా.

శుక్రవారం నుండి స్టార్ట్ అయ్యే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసలు పొత్తే లేదు అని చెప్పిన వారు కలిసి భేటీ అవ్వడం అంటే మారుపు వచ్చినట్టే. పాత మిత్రులను నిలుపుకునే ప్రయత్నంలా కనిపిస్తుంది ఇది. 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి నడుస్తాయా?

మరోవైపు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగొచ్చిన చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాల పై దృష్టి సారించారు. అమరావతి వెళ్ళకుండా హైదరాబాద్లోనే మకాం వేశారు. ఐతే ఆయన ఇప్పుడే పొత్తుల విషయంలో క్ల్యారిటీ ఇస్తారో ఎప్పటిలానే చివరి వరకు మౌనంగానే ఉంటారో చూడాలి.