telangana BJP supports TRSప్రతిపక్ష పార్టీలన్ని జట్టుగా కట్టి కేసీఆర్ ను గద్దె దించే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం ఈ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. కోదండరాం పార్టీ అయినా కలిసి వస్తుందని అనుకుంటే ఆ పార్టీ కూడా మహాకూటమిలో చేరిపోయింది. ఎప్పుడైతే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ ను పార్లమెంట్ సాక్షిగా పొగిడారో అప్పుడే బీజేపీ అవకాశాలు రాష్ట్రంలో చెరిగిపోయాయి. పైగా బీజేపీ ఇక్కడ తెరాస బి టీం అని చాలా మంది అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే తెరాస ఇప్పటిదాకా బీజేపీ స్థానాలలో అభ్యర్థులను పెట్టలేదు.

వీక్ కాండిడేట్లను పెట్టి బీజేపీ సహకరిస్తాని సమాచారం. ఈ క్రమంలో బీజేపీ కూడా తెరాసకు తన వంతు సాయం చేస్తుంది. ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంగా గెలిచేలా ఉంటేనే బీజేపీకి ఓటు వెయ్యండి లేకపోతే తెరాసకు వెయ్యండి అని చెబుతున్నారట. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వైపుకు వెళ్లకుండా చేయ్యవచ్చు అనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఇటువంటి వ్యూహం వల్ల బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు పోగొట్టుకోవడం, అలానే పార్టీ రాష్ట్రంలో ఎదిగే అవకాశం కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది.

బీజేపీ ఓట్లను తెరాసకు మళ్ళిస్తే ఆ పార్టీ ఓటుబ్యాంకు ఎన్నికల తరువాత వీక్ గా కనిపిస్తుంది. దీనితో పార్టీ నాయకుల క్యాడర్ మనోధైర్యం దెబ్బ తినడంతో పాటు… ప్రజలకు బీజేపీ మీద నమ్మకం కూడా పోతుంది. సొంతంగా పోటీ చేస్తుంది కాబట్టి వచ్చే ఫలితాలకు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను నిలువరించడానికి తెరాసను గెలిపించాలని అనుకోవడం బీజేపీకి ఆత్మహత్యా సదృశ్యమే. మరోవైపు ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడానికి తంటాలు పడుతుంది. వేరే పార్టీల నుండి వచ్చే రెబెల్స్ కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది.