Telangana BJP President Bandi Sanjay Kumar comments on Andhra Pradesh politicsతెలంగాణలో బీజేపీ బలోపేతం చెయ్యడంలో బండి సంజయ్ ది ఖచ్చితంగా కీలకపాత్రే. అయితే సంజయ్ ని తిరుపతిలో ప్రయోగించాలని బీజేపీ అనుకోవడం గమనార్హం. ఈ తరుణంలో సంజయ్ ఉన్నఫలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కామెంట్లు మొదలుపెట్టారు. తనదైన శైలిలో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

తిరుపతిలో జరిగే ఉపఎన్నిక బైబిల్ కి భగవద్గీతకు మధ్య జరుగుతుందంట. “తిరుపతిలో నివసిస్తున్న హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి.. తిరుపతి ప్రజలు స్వామి వారి అవమానానికి బుద్ధి చెప్పాలి.. తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులనే గెలిపించాలి.. హిందువులకు అతిపెద్దదైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బిజెపిని గెలిపించి ధర్మ రక్షణకు పాటుపడాలి,” అంటూ పిలుపునిచ్చారు.

బీజేపీకి ఓటు వెయ్యమనడం ఒకే… ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులనే గెలిపించాలి అనడం కూడా ఒకే. కానీ బైబిల్ కి భగవద్గీతకు మధ్య జరిగే ఎన్నిక ఏమిటి? ఏపీలో దేవాలయాల మీద దాడులు జరగడం నిజమే. దానివెనుక ఆకతాయిలు… మాత చాందసవాదులు ఉండవచ్చు… దానికి మతానికీ, బైబిల్ కి సంబంధం ఏమిటి? ఇటువంటి ఆరోపణల వల్ల గుడుల మీద దాడులు పెరగడం ఖాయం.

అంతటితో ఆగకుండా మతగొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయ అవసరార్ధం బీజేపీ వాటిని కోరుకోవచ్చు… కానీ ఆంధ్రప్రదేశ్ కి అది మంచిది కాదు. “పక్క రాష్ట్రం వాడైనా సంజయ్ ఏపీకి వచ్చి రాజకీయాలు చెయ్యొచ్చు కానీ మతాల మధ్య చిచ్చు పెడతాం అంటే చూస్తూ ఊరుకోము. బైబిల్ ఎమన్నా అంటరాని గ్రంధమా? ఏంటి ఈ వాగుడు,” అంటూ పలువురు హెచ్చరిస్తున్నారు.