BJP - Kamma Community - GHMC Electionsజీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు చిత్రంగా వచ్చాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చావుతప్పి కన్ను లొట్టబోయింది. ఎలాగోలా గా అవతరించి ఇప్పుడు మేయర్ పీఠం ఎలా నిలబెట్టుకోవాలని అని చూస్తుంది. బీజేపీకి దాదాపుగా తెరాసతో సమానంగా సీట్లు, ఓట్లు రావడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఇది అలా ఉండగా… ఈ ఎన్నికలలో మరో చిత్రం చోటు చేసుకుంది.

ఆంధ్ర నుండి సెట్లర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలలో తెరాసకు ఎక్కువ సీట్లు రావడం. కూకట్ పల్లి సర్కిల్ లోని 22 వార్డులకు గాను తెరాస 20 చేజిక్కించుకుంది. అదే సమయంలో శేరిలింగంపల్లి సర్కిల్ లోని పదిహేను వార్డులకు గానూ అధికార పార్టీ పదమూడు గెలుచుకుంది. ఈ రెండు ప్రాంతాలలోనూ ఆంధ్ర సెట్లర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే కనిపిస్తున్న కమ్మ కులం మీద ద్వేషం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలోకి కూడా ప్రవేశించింది. ఈ ప్రాంతాలోని కమ్మ వారి కారణంగా తాము రెండవ స్థానంలోనే ఉండిపోయాం అని బీజేపీ సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టడం విశేషం.

తమ కుల పార్టీకి ఆంధ్రాలో మనుగడ లేకుండా చేస్తోంది బీజేపీ కాబట్టి ఆ అక్కసుతో తెరాసకు ఓట్లు వేశారు అంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ ప్రాంతాలలో అన్ని వర్గాల ఆంధ్ర ప్రజలు ఉన్నా తెలుగుదేశం, కమ్మ వారు అంటూ బ్రాండ్ చేసి బూతులు తిట్టడం గమనార్హం.