BJP Turns Disaster in Telangana Electionsఇటీవలే జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది. 18 స్థానాలకు గానూ 103 స్థానాలలో డిపాజిటు కోల్పోయింది. కేవలం 15 స్థానాలలోనే ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. ప్రధాన పార్టీలలో ఎక్కువ డిపాజిట్లు కోల్పోయింది బీజేపీనే. బీజేపీ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బీజేపీ కోసం ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.

పార్టీ ప్రెసిడెంటు లక్ష్మణ్, ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఈసారి ఓడిపోయారు. 2014 ఎన్నికలలో టీడీపీ తో పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అప్పట్లో ఓటమి నెపాన్ని సైకిల్ పార్టీ మీదకు తోసేసింది. ఇప్పుడు ఎటువంటి పొత్తు లేకుండా వారికి కావాల్సిన వారికి సీట్లు ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కూడా తమ ఓటమికి కారణం తెలుగుదేశం పార్టీనే అంటుంది బీజేపీ. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం వల్లే తాము ఓడిపోయాం దాని వల్ల సెంటిమెంటు పెరిగి తమకు వచ్చే ఓట్లు కూడా తెరాసకు వెళ్లిపోయాయని బీజేపీ ఉద్దేశమట.

ఈ లెక్కన టీడీపీతో పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ ఓటమికి ఆ పార్టీనే కారణం అన్నమాట. దీనితో పాటు ఎన్నికల సంఘం తప్పిదాల వల్ల కూడా అంట. అంతేగాని రాష్ట్ర బీజేపీ నేతల చేతగానితనం ఏమీ లేదట. మరోవైపు ఇప్పుడు ఓడిపోయిన వృద్ధ కపోతాలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై కన్నేశాయి. తమను ఎన్నికలలో నిలపాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నాయి. నిన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌, ఈబీసీలకు రిజర్వేషన్లు, కశ్మీర్‌ విషయంలో సైన్యానికి ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇవ్వడం వంటి అంశాలతో భాజపాకు వచ్చే ఓటింగ్‌ శాతం గణనీయంగా వృద్ధి చెందుతుంది. సీట్ల సంఖ్య పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసారు

లక్ష్మణ్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిన కారణాలలో ఒకటి కూడా రాష్ట్ర అంశం లేకపోవడమే పరిస్థితి నిదర్శనం. ఇప్పుడు మోడీ వేవ్ ఉపయోగపడితే ఏదో రకంగా పార్లమెంట్ కు వెళ్ళిపోవచ్చని వీరి ఆశ. దీనిలో సొంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు కనిపించడం లేదు. వీళ్ళ డిమాండ్లు ఒప్పుకుంటే బీజేపీ మరో సారి మునగడం ఖాయం. ఈ ఎన్నికలలో కూడా బీజేపీ జాతీయ నాయకుల హావ నే కొనసాగబోతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరి నెలాఖరు లేదంటే మార్చి మొదటివారంలో నిజామాబాద్‌ వస్తారు. మార్చి నెలలో ప్రధాని నరేంద్రమోదీ సభ హైదరాబాద్‌లో ఉంటుంది.