Operation Kill Congress in Telangana by Amit Shahతెలంగాణలో… తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని ఆర్బాటపు ప్రకటనలు చేసే బీజేపీ నేతలకు ఆ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా నే షాక్ ఇచ్చారు. అమిత్ షా చేయించుకున్న సర్వేలో తెలంగాణలో 7 శాతం, గ్రేటర్ హైదరబాద్‌లో 5 శాతం మాత్రమే బీజేపీకి ప్రజల మద్దతు ఉన్నట్లు వెల్లడయిందని చెప్పారట.

గతంలో బీజేపీకి ఛాన్స్ ఉందని అంచనా వేసుకున్న అమిత్ షా తెలంగాణపై దృష్టి పెట్టారు. రెండు దఫాలు పర్యటించారు. ఆ తర్వాత తెలంగాణ పార్టీకి సమయం కేటాయించడం తగ్గించేశారు. దీనితో అడిగేవారే లేకపోవడంతో ఆ పార్టీ నేతలు అనధికార, అదికారపక్షమన్నంత క్లోజ్‌గా కలిసిపోతున్నారు.

నేతల తీరుతో ద్వితీయశ్రేణి నాయకత్వం పూర్తిగా ఆశలు వదిలేసుకుంటున్నారు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రోజు..రోజుకు పార్టీ బలహీనపడిపోతుందన్న భావన అందరిలో పెరిగిపోయింది. ఇటీవలే కాలంలో అమిత్ షా ను రాష్ట్రానికి తీసుకుని రావాలని ట్రై చేసిన ఆ పార్టీ నేతలు నిరాశగానే తిరిగి వచ్చారు.

అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో బలపడటంతో బీజేపీ నాయకత్వం తెరాసకు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టింది. ఉన్నపళంగా ఆగమేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబందించిన అన్ని అనుమతులు ఇచ్చి తెరాస ప్రభుత్వానికి వీలైనంత సాయం చేసి అధికార పక్షాన్ని బలపరుస్తుంది.