KCR - ys Jaganప్రపంచం మొత్తం కరోనా రక్కసి కారణంగా చిగురుటాకులా వణికిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి 600కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదే ఉమ్మడి రాష్ట్రమైతే దేశంలోనే ఎక్కువ కేసులు కలిగిన రాష్ట్రాలలో రెండో స్థానంలో ఉండేవారం. అయితే పరిస్థితి ఇంతకు మించి సీరియస్ అని కొందరు అంటున్నారు.

నమోదు అవుతున్న కేసులు, మరణాల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిజాయితీగా ప్రజలకు సమాచారం ఇవ్వడం లేదని చాలా మంది అభిప్రాయం. కొన్ని కేసులు, మరణాల గురించి మీడియాలో వచ్చిన 3-4 రోజులకు గానీ ప్రభుత్వం ధృవీకరించడం లేదు. తెలంగాణ ప్రభుత్వమైతే వీటికి సంబందించిన బులెటిన్లు కూడా తగ్గించేసింది.

పైగా అసలు ఎక్కడెక్కడి వారికి వైరస్ సోకింది అనే సమాచారం కూడా ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తుండడం గమనార్హం. ఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో కేవలం 6 ల్యాబ్‌లే ఉన్నాయని, టెస్టింగ్‌లు చాలా తక్కువని ఆయన అంటున్నారు.

ఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడంలేదన్నారు. వాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరమన్నారు. కేసులు, మరణాల విషయంలో ఇరు ప్రభుత్వాల సమర్ధకులు మాత్రం ప్రజలను ఆందోళనకు గురి చెయ్యకుండా ఉండటం కోసమే ఇలా చేస్తున్నారని సమర్ధించుకుంటున్నారు. ఇంతటి విపత్తు విషయంలో అటువంటిది మంచిది కాదని, భయపెడితే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటారని మరి కొందరి వాదన.