Tekkali Gautam Buddha hand broken
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహ ధ్వంసం అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. టెక్కలి సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులో గల బుద్ధుని విగ్రహం చేతి మణికట్టు విరిగిపోయింది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. దీనితో ప్రభుత్వం హుటాహుటిన అది మూడు నెలల క్రితం సాధారణంగానే ఊడిందని అధికారులతో చెప్పించారు.

బుద్ధుని విగ్రహం సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని… మూడు నెలల క్రితమే ఊడినదానికి హడావిడి చేస్తున్నారని… విగ్రహ రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు.. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేద్దామని ప్రయత్నించి భంగపడ్డారని సాక్షి ఒక కథనం వండి వార్చింది.

సరే కాసేపు అది మూడు నెలల క్రితం సహజంగానే ఊడిపడింది అనుకుందాం. మరో మూడు నెలల నుండి అధికారులు ఏం చేస్తున్నట్టు? చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తుంది కదా? మరి బుద్ధుడి విగ్రహానికి చిన్నపాటి మరమ్మత్తు ఎందుకని చేయించలేదు.

అంత స్పష్టంగా అధికారులు అది మూడు నెలల క్రితమే జరిగింది అని చెబుతున్నప్పుడు వారికి ఆ విషయంపై సమాచారం ఉన్నట్టే కదా? ప్రభుత్వం ఆ విషయం గా అధికారుల మీద చర్యలు తీసుకోకుండా అదేదో ఘనకార్యం లాగా ప్రతిపక్షాలు భంగపడ్డాయి అని గొప్పగా సొంత మీడియాలో చెప్పుకోవడం ఏంటో? అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.