Tejaswi Madivada , న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘క‌మిట్‌మెంట్‌’ ‌లో తేజ‌స్వి మ‌దివాడ‌, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. “ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్” అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి సంబందించిన న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్ మొన్న ఆ మధ్య విడుదల చేశారు.

ఈరోజు తేజ‌స్వి మ‌దివాడ బర్త్ డే సందర్భంగా క‌మిట్‌మెంట్‌’లో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బికినీ ధ‌రించి బోల్డ్ అవ‌తార్‌లో తేజ‌స్వి ద‌ర్శ‌న‌మిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన తేజస్వికి సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతుంది.

బిగ్ బాస్ కారణంగా ఆడియన్స్ దృష్టిలో పడినా పెద్దగా అవకాశాలు రాలేదు. దీనితో ఈ అమ్మడు అందాల ఆరబోత డోసు పెంచింది. ఆ ప్రకారం వస్తున్న ఈ క‌మిట్‌మెంట్ ఏ విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. బికినీలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘హైద‌రాబాద్ న‌వాబ్స్’ ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం అందిస్తోన్న ఈ చిత్రానికి న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. లక్ష్మీకాంత్ ఇటీవలే ఆహా కు ఎక్సక్లూసివ్ గా నవదీప్ హీరోగా రన్ అనే సినిమా తీశారు. అది కూడా ప్లాప్ గా మారింది. దీనితో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.