teaser-talk-dhruva-pareshanura-song-ram-charan-rakul-preet“ధృవ” సినిమాపై మెగా అభిమానులు పెట్టుకున్న అంచనాలు క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాయి. ఆ అంచనాలకు మరో మూడు మెట్లు ఎక్కించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. “ధృవ” ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ‘పరేషాన్’ వీడియో సాంగ్ లో రకుల్ అందాల విందు చూసి వీక్షకులు ముగ్ధులైపోయారు. హీరోయిన్ గా ఇప్పటికే చాలా సినిమాలలో కనిపించినప్పటికీ, ఇంతగా రకుల్ రెచ్చిపోయింది లేదు. ఒక రకంగా ఈ బీచ్ సాంగ్ లో రకుల్ మరింత అందంగా కూడా కనిపిస్తోంది.

రెడ్ అండ్ వైట్ డ్రెస్ లలో ఓ పక్కన రకుల్ పరువాల విందు చేస్తూ మగవాళ్ళ చూపులన్నీ తన వైపుకు తిప్పుకుంటే… తానేం తక్కువ కాదన్నట్టు షర్టు లెస్ తో రామ్ చరణ్ కూడా మహిళల మనసు దోచే విధంగా దర్శనమిచ్చాడు. మొత్తమ్మీద విజువల్ గా “ధృవ” సినిమాలో హైలైట్ సాంగ్ అయ్యే విధంగా కనపడుతున్న ఈ ‘పరేషాన్’ సాంగ్, వెండితెరపై కనిపించినపుడు మెగా ఫ్యాన్స్ ను నిజంగా ‘పరేషాన్’ చేయడం ఖాయం. ఈ పాటతో పాటు విడుదలైన మరో సాంగ్ ‘నీతోనే డ్యాన్స్ టు నైట్’లో కూడా రకుల్ ఓ రేంజ్ లో కనిపించింది.