teaser-talk-chiranjeevi-khaidi-no-150-vs-vijay-kathiవి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఖైదీ నంబర్ 150” సినిమా, మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన “కత్తి” సినిమా రీమేక్ అన్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమాగా ఓ రీమేక్ ను ఎంపిక చేసుకోవడంతో “కత్తి”పై టాలీవుడ్ వర్గాల కళ్ళు పడ్డాయి. తాజాగా మెగాస్టార్ మొదటి టీజర్ విడుదల కావడంతో, ఈ రెండు టీజర్ లలో ఏది బాగుంది అన్న టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మెగా అభిమానులను మినహాయిస్తే… మిగతా అందరి ఓటు మురుగదాస్ – విజయ్ ల “కత్తి”కే పడుతోంది. మరో విశేషమేమిటంటే… పెద్ద మార్పులు లేకుండానే చిరు “ఖైదీ నంబర్ 150” సిద్ధమవుతోందన్న సంకేతాలు కనపడ్డాయి. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో విజయ్ “కత్తి” సూపర్ సక్సెస్ కావడంతో, సరిగ్గా అదే షాట్లను “ఖైదీ”లో రిపీట్ చేయడంతో, ఒరిజినల్ చూసిన వారిని పెద్దగా సంతృప్తి పరచడంలో “ఖైదీ” విఫలమైంది.

అలాగే “కత్తి” టీజర్ కు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉండగా, దానిని మక్కికి మక్కి కాకపోయినా కొంతమేరకు దేవిశ్రీ కాపీ చేసాడన్న టాక్ వినపడుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా “ఖైదీ” కన్నా “కత్తి”నే ముందు వరుసలో ఉంది. మొత్తమ్మీద “కత్తి” చూసిన వాళ్ళకు “ఖైదీ” పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయడం లేదు.