Lack of Unity for Opposition Proves to be A Boon for Jaganఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కులం కార్డు సమర్ధవంతంగా ఉపయోగించింది. చంద్రబాబు అంటే కమ్మ కులానికి మాత్రమే పని చేసే వ్యక్తి అంటూ మొదలు పెట్టి ఆ కులాన్నే వెలి వెయ్యాలి అన్నట్టు మెజారిటీ ప్రజలలో ఆ కులం మీద ఏహ్య భావం కలిపించడంలో చాలా వరకు సఫలీకృతం అయ్యారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాకా కూడా ఇదే ఫార్ములా వాడుతుంది ఆ పార్టీ. తమ ప్రభుత్వం ఏది తేడా జరిగినా అది చంద్రబాబు కు కమ్మ కులానికి ఆపాదించడం మొదలు పెట్టారు. స్థానిక ఎన్నికల వాయిదా నుండి మొన్న జరిగిన హోటల్ స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాదం వరకూ ఇదే పంథా. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సంగతి ఎలా ఉన్నా ఆ కులం వారు మాత్రం ఈ ప్రచారం పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్న కమ్మ నాయకులు దీనిని ఖండించరా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే అట్టి నాయకులు ఖండించకపోగా… సొంత కులం మీదే విమర్శలు చెయ్యడం విశేషం. నిన్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ హోటల్ స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాదం పై హీరో రామ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

తప్పుపడితే తప్పు లేదు.. కానీ రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా. వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి అంటూ వంశీ అనడం విశేషం. “వంశీ మాటలు ఎవరో వేరే కులం వారు అన్నట్టుగా ఉంది. కమ్మ వారి మీద అదే కులం వారిని ప్రయోగిస్తున్నారు జగన్. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఇంత దిగజారాలా?,” అంటూ ఆ సామాజిక వర్గం వారు విరుచుకుపడుతున్నారు.