Chandrababu - Naidu -TDP-YS Jagan -YSRCPతూర్పు తీర్పు ఎటు ఉంటే ఆ పార్టీదే ఆధిక్యం అని నమ్మకం ఎప్పటి నుండో ఉంది. జిల్లాలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో రావడం మూడున్నర దశాబ్దాలుగా వస్తోంది. దీనితో ప్రధాన పార్టీలూ ఇక్కడ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేశాయి. అయితే ఇక్కడ గెలుపుపై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు వారి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరికీ వారు తామే గెలుస్తున్నాం అంటూ ఆశాభావం వ్యక్తం చెయ్యడం విశేషం. జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లు గెలుస్తామంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని కారణాల వల్ల మూడు సీట్లు స్వల్పతేడాతో ఓడిపోతామని చెప్పడం విశేషం. పసుపు-కుంకుమ, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా ఉందని వారి అంచనా. మరోవైపు జిల్లాలో పదికిపైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామంటూ వైసీపీ నేతలు, అభ్యర్థులు ధీమాగా చెప్తున్నారు. అలాగే మూడు లోక్ సభ సీట్లు మావే అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే తమకు అనుకూలిస్తుందని వారు అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రమే జిల్లాలో జనసేన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందంటున్నారు.

కాకినాడ పార్లమెంటు పరిధిలో రెండు, అమలాపురం లోక్‌సభ పరిధిలో మూడు, రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో ఒక అసెంబ్లీ పరిధిలోనూ జనసేన చీల్చే ఓట్లు కీలకం కాబోతున్నాయని వారు అంటున్నారు. కోనసీమలో టీడీపీకి, రాజమహేంద్రవరం పరిధిలో వైసీపీకి జనసేన చీలిక వల్ల నష్టం వస్తుందని అంచనావేస్తున్నారు. దీనితో ఫలితాలు అంత ఏకపక్షంగా ఉండవని వారి అంచనా. దీనితో మే 23న ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది.