tdp village sarpanch madhavilatha died due to coronaఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీకి ఉండే సహజమైన అనుకూలత కారణంగా దాదాపుగా అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రధాన ప్రతిపక్ష పార్టీ… టీడీపీ అభ్యర్థులు గట్టిగా నిలబడి అధికారపార్టీకి గట్టి పోటీనిచ్చారు.

అలా ఎదురు నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్ శ్రీమతి మండే మాధ‌వీలత ఎన్నికై మూడు నెలలు కూడా కాకుండానే కరోనా కాటుకు బలైపోయారు. మండే మాధ‌వీలత పెదకాకాని గ్రామ సర్పంచ్ గా టీడీపీ మద్దతు తో నిలబడి గెలిచారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి ల సొంత ఊరు పెదకాకాని.

ఆ ఊరులో మాధవీలత 1000 ఓట్లకు పైగా ఆధిక్యం తో గెలిచి సంచలనం సృష్టించారు. అటువంటి నాయకురాలని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. పెదకాకాని 2019లో నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం. అప్పటి నుండి దాని మీద లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఆమె మృతికి లోకేష్ ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. రాజకీయ నాయకులు కరోనా కారణంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కాలంలో కూడా ప్రజలకు దగ్గరగా ఉండాల్సి రావడంతో వారు కరోనాని తప్పించుకోలేకపోతున్నారు. మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉంటున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు ఇరవై వేలకు పైగా కేసులు, 100 మరణాలు సంభవిస్తున్నాయి.