TDP Targets more on Kadapa వైఎస్సార్‌సీపీ కంచుకోట అయిన కడప జిల్లాలో గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతుంది టీడీపీ. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రాజంపేటతో పాటు ఆ పార్టీ ఓటమి చెందిన మిగిలిన 9 స్థానాల్లో అభ్యర్డులని ఖరారు చేసేపనిలో ఉన్నారు ఆయన.

జమ్మలమడుగు నుంచి పోటీచేసిన పి. రామసుబ్బారెడ్డి స్థానంలో వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించి మంత్రి అయిన ఆదిని ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. రామసుబ్బారెడ్డిని పెద్దల సభకు పంపి సరైన గౌరవం ఇచ్చారు. ఈ రెండు వర్గాలు కలసి పనిచేసేలా చెయ్యడమే ఇక్కడ కీలకం.

బద్వేలులో టీడీపీ ముఖ్య నేతలు మూడు వర్గలుగా విడిపోయారు. వీళ్ళు కలిసి పనిచెయ్యడంలోనే విజయావకాశాలు ఉన్నాయి. మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తప్పించి మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డిని బరిలోకి దించడం దాదాపు ఫైనల్. రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డి, రైల్వేకోడూరు నుంచి పోటీచేసి ఓడిన ఓబిలి సుబ్బరామయ్య, కమలాపురంలో పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డి, రాయచోటి నుంచి ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌రెడ్డి ఈసారి టికెట్ తెచ్చుకోవడం కష్టమే.

జగన్ సొంత నియోజకవర్గం ఐన పులివెందులలో కూడా టీడీపీ టికెట్కోసం భారీ పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, పార్టీ నాయకుడు పేర్ల పార్థసారధిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ప్రొద్దుటూరు నుంచి ఈసారి తాను పోటీకి దిగాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చాలాకాలం నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆయనకు కూడా గట్టిపోటీనే ఉంది. ఒకప్పుడు టీడీపీ పోటీ అంటేనే బయపడే జిల్లాలో నేడు ఈ పరిస్థితి అంటే టీడీపీ రాయలసీమలో బలపడినట్టే అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.