MLA Bonda uma satires on MLA Rojaవిశాఖకు రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశంలో ‘మగాళ్ళు’ లేరు అంటూ రోజా చేసిన కామెంట్లు టిడిపి వర్గాల్లో సెగలు పుట్టించాయి. దీంతో ఈ కామెంట్స్ ను ‘జోక్స్’గా మార్చేస్తూ తాజాగా తెలుగుదేశం నేతలు సెటైర్లు వేస్తున్నారు. “అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు… పది సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నారు… ఎంతమంది మగవాళ్లు ఉన్నారో మీకు తెలుసు… ఎంతమంది మగవాళ్లను చూశారో కూడా మీకు తెలుసు… తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే రోజారెడ్డి గారు” అంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రమైన పదజాలంతో స్పందించారు.

అలాగే మరో సీనియర్ నేత గాలి కూడా రోజాను ఎద్దేవా చేసే వ్యాఖ్యలు చేయడం విశేషం. “తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరని అంటున్న నగరి ఎమ్మెల్యే రోజా టెస్టింగ్ ఏజెన్సీ ఏమైనా పెట్టారా? అని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అందరూ సమానమేనని, అయితే ఎమ్మెల్యే రోజా మాత్రం ‘ఐరన్ లెగ్’ అన్న విషయం అందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు.