tdp-protest-against-amit-shah-in-tirupatiస్థాపించిన నాటినుండీ టీడీపీ ఎన్నో అవరోధాలు ఎదురుకుంటూ వస్తుంది అయితే ఆ పార్టీ అన్నిటికి ఎదురు నిలిచింది. ఇందిరా గాంధీ నుండి రాజశేఖరరెడ్డి, నేడు మోడీ అమిత్ షా వరకు ఎవరికీ ఎదురు వెళ్లాల్సి వచ్చినా ఆ పార్టీ అభిమానులు రెండో ఆలోచన చెయ్యరు. అవతలవైపు ఉన్న వారు ఎంతటి బలవంతులు అనేది ఆలోచించారు.

వారు ఆలోచించేదల్లా అది పార్టీకి రాష్ట్రానికి మంచిదా కదా అనేది మాత్రమే. దీనికి ఉదాహరణే ఈరోజు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షా పర్యటన సంధర్భంగా చేపట్టిన నిరసన. 21 రాష్ట్రాలలో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసి, కేంద్రంలో సొంతగా మెజారిటీ తెచ్చుకున్న మోడీ అమిత్ షా ద్వయం ఈరోజు దేశరాజకీయాల్లో అత్యంత శక్తిమంతులు.

అయితే అటువంటి అమిత్ షాకే తిరుమల దర్శనార్ధం వస్తే నల్ల జెండాలు చూపించారు తెలుగు తమ్ముళ్లు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ మోసం చేసిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కిందని, మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకొచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీశారు.

కాగా కొంతమంది అమిత్ షా కాన్వాయి పై రాళ్లదాడి చేసినట్లు సమాచారం వచ్చింది. ఒకరకంగా ఇది సాహసమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి గట్స్ వల్లే తెలుగు దేశం పార్టీ ఇతర పార్టీలకంటే ముందు ఉంది. దీని వల్లే స్పెషల్ స్టేటస్ పోరులో ఆఖరుగా ఎంటర్ అయినా టీడీపీనే ప్రజలను ఆకట్టుకోగల్గుతుంది.