State-BJP-Leaders-Becomes-Burden-for-Andhra-Pradeshబీజేపీ నాయకుల తీరు చాలా చిత్రంగా ఉంది. పెద్ద నోట్లు రద్దు తరువాత జరిగిన పరిణామాలు చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమై ఇప్పుడు ఆ నేరం మరొకరి మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. నోట్లరద్దు తరువాత ఇప్పటికి నగదు లభ్యత మెరుగవ్వలేదు. ఇటీవలే కాలంలో అది మరీ ఎక్కువయ్యింది.

మొన్నటిదాకా అదేమి లేదు అంతా బానే ఉంది అని చెప్పుకొచ్చిన కేంద్రం తాజాగా దానికి వంకలు వెతికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. దానిని అందిపుచ్చుకుని బీజేపీ రాష్ట్ర లీడర్లు తెలుగు దేశం ప్రభుత్వం మీద విమర్శలు గురి పెడుతున్నారు.

కేంద్రం పంపుతున్న డబ్బును అలాగే కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులకు టీడీపీ ప్రభుత్వం పంపుతుందని వారి ఆరోపణ. బీజేపీ ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓడించాలని ఈ పని చేస్తుందని వారి ఆరోపణ. అయితే నగదు కొరత ఒక్క దక్షిణాదినే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఉన్నట్టు జాతీయ మీడియా క్లియర్ గా చెబుతుంది. మరి అక్కడ డబ్బును కూడా టీడీపీనే కర్ణాటక తరలిస్తుందో.