Will Chandrababu Naidu Listen to TDP Cadre's Anguish?స్థానిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాల మధ్య పొత్తు పొడవనుందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు కె.రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరనాథరెడ్డి భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలలో కలిసి పని చెయ్యాలి అనేదాని మీద చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

అయితే ఈ విషయంలో సీపీఎం వైఖరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ పార్టీ ఎన్నికల తరువాత పెద్దగా యాక్టీవ్ గా లేదు. కొంత మేర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో సీపీఎం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఈ నెల 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరుగుతుంది.

ఆ సమావేశంలో ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు జనసేనతో కలిసి పోటీ చేశాయి. అయితే కనీసం ఒక్క సీటులో కూడా ధరావత్తు దక్కించుకోలేకపోయాయి. ఎన్నికల తరువాత జనసేన బీజేపీతో జతకట్టడంతో మళ్ళీ ఒంటరి అయిపోయాయి.

దీనితో ఇప్పుడు తమ ఓటుబ్యాంకు నిలుపుకోవడం కోసం టీడీపీ పక్కన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్ని స్థానిక ఎన్నికలు పూర్తి చేసే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం. ఈ తరుణంలో ఈ పొత్తు పంచాయితీ తేలుతుందా? తేలినా మెరుగైన ఫలితాలు రాబట్టగలవా అనేది చూడాలి.