Chandrababu Naidu - Jaganవైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు మొత్తానికి ఒక కొలిక్కి వచ్చాయి. వారు రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం అని చెప్పడంతో మరోసారి ధ్రువీకరణ లేఖలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. వారు ఆ మేరకు లేఖలు ఇవ్వడంతో ఎప్పుడైనా స్పీకర్ వాటిని అమ్మోదించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలకు ఏడాది లోపు ఉండటంతో ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు తక్కువే అని నిపుణులు చెప్తున్నారు.

దీనితో వారికి స్వామి కార్యం స్వకార్యం నెరవేరినట్టు అయ్యింది. అయితే అనుకోకుండా చంద్రబాబుకు జగన్ పెద్ద సాయం చేశాడా? అనే ప్రశ్న రాకమానదు. వచ్చే పార్లమెంట్ సెషన్ లో టీడీపీ ఒకటే అవిశ్వాసతీర్మానం పెడుతుంది. ఈసారి ఎలాగైనా అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనితో కేంద్రంపై పోరాడుతున్న క్రెడిట్ టీడీపీకే దక్కబోతోంది.

పైగా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే రాజీనామాలు చేశారనే నింద కూడా వైకాపా మీద పడుతుంది. మరోవైపు ఉపఎన్నికలు జరిగే ఒకటి రెండు స్థానాలు కోల్పోయినా మొదటికే మోసం వచ్చినట్టు. చూడాలి రానున్న కొన్ని నెలల్లో ఏంజరగబోతుందో.