TDP No Confidence Motion in Lok Sabha-టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించి.. సభ ముందు ఉంచారు. తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు. దీంతో చర్చపై తేదీని తర్వాత వెల్లడిస్తామని స్పీకర్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మధ్నాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ ఖరారుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే అవిశ్వాస తీర్మాణం పెట్టడం దానిని చర్చ వరకు తీస్కుని వెళ్ళడం ఖచ్చితంగా టీడీపీ విజయంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఆ తీర్మాణం ఓటింగు వరకు వెళ్ళి కొద్దీ పాటి తేడాతో వీగిపోతే వైకాపాకు చెందిన అయిదుగురు ఎంపీల రాజీనామా కీలకంగా మారబోతున్నాయి.

పైగా మోడీ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత జగన్ ఖాతాలోకి చేరుతుంది. ఎంపీలు రాజీనామా చేసిన ఉపయోగం లేకపోగా అది మొత్తానికే మోసం చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే అది వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు సెల్ఫ్ గోల్ గా పరిణమించే అవకాశంగా ఉంది. ఈ పరిణామం 2019 ఎన్నికల ముందు చాలా కీలకం కావొచ్చు.