tdp-mps-join-bjp-ysrcp-vijaya-sai-reddyనలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంతో టీడీపీ అయోమయంలో పడింది అయితే ఈ విషయంలో బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల స్పందన విడ్డురంగా ఉండటం గమనార్హం. “లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్,” అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

అయితే ఎంపీలు పార్టీ మారడానికి రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి, సీఎం రమేష్ లోక్ సభ గేలరీలో కూర్చుని గంటన్నర సేపు మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. నిన్న ప్రధాని అన్ని పార్టీలకు ఇచ్చిన విందులో సీఎం రమేష్, సుజనా చౌదరి పక్కపక్కనే కూర్చుని విందు ఆరగించడం కనిపించింది. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు వీరు అవినీతిపరులని, చంద్రబాబు బినామీలని నిందించిన బీజేపీ వారు ఈ చేరికలను సమర్ధించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి బీజేపీలో చేరినంత మాత్రాన ఐటీ, ఈడీల నుంచి తప్పించుకోలేరని ఆ పార్టీ నేత మురళీధరరావు అన్నారు. పార్టీ అభివృద్ధి కోసమే టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నామని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి వారినైనా తీసుకుంటాం అని వారు చెబుతున్నారా? మెజారిటీ ఎంపీలు విలీనం అయితే అనైతికం ఎలా అవుతోందని మురళీధరరావు ప్రశ్నించారు. మరి గతంలో తెరాస ఇదే పడతి అనుసరించినప్పుడు బీజేపీ ఎందుకు తప్పు పట్టినట్టు?