TDP MP Pandula Ravindra Babu joins ysrcp
సరిగ్గా నెల రోజుల క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు అప్పుడే తత్వం బోధపడిందట. ఇప్పుడు మళ్ళీ టీడీపీలో కి వస్తా అంటూ ఆ పార్టీ నేతలతో భేరసారాలకు దిగుతున్నారని సమాచారం. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరకముందు ఇచ్చిన గౌరవం చేరిన తరువాత లేదని ఆయన తన మాజీ స్నేహితుల వద్ద వాపోతున్నారట. అదీ గాక పార్టీలో చేర్చుకునే క్రమంలో తనకు ఇస్తా అని చెప్పిన సీటు కూడా లేదంటున్నారట.

దీనితో ఆయన రాజకీయంగా జన్మ నిచ్చిన టీడీపీకే మళ్ళీ వచ్చేయాలని అనుకుంటున్నారట. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరే సమయంలో టీడీపీ మీదా చంద్రబాబు మీదా అన్న మాటలు కూడానా విజయసాయిరెడ్డి స్క్రిప్ట్ అని, దానికి మీడియా ముఖంగా క్షమాపణ చెబుతా అని ఆయన ఇప్పటికే టీడీపీ నేతలతో అంటున్నారట. అయితే దీని పై నిర్ణయం మాత్రం అధినేత చంద్రబాబు నాయుడే తీసుకోవాలని నేతలు ఆయనకు చెప్పేశారట. ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి క్యాడర్ కూడా వ్యతిరేకిస్తుందట.

ఒకవేళ రవీంద్రబాబు వెనక్కు రావడమంటూ జరిగితే అది వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. టీడీపీ నుండి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి మారిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఆ పార్టీలో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. అయితే అవంతి శ్రీనివాస్ ది అడుగువెనక్కు తీసుకోలేని పరిస్థితి. టీడీపీ మీద ఆయన వాడిన బాష అటువంటిది. రవీంద్రబాబు అమలాపురం ఎంపీ సీటు దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి తనయుడికి టీడీపీ దాదాపుగా కంఫర్మ్ చేసేసింది.