Chandrababu-Naidu's-First-Public-Appearance-Post-the-Shocking-Defeatఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలనమైన విజయం నమోదు చేసింది. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 సీట్లలో, 25 ఎంపీ సీట్లలో 22 కైవసం చేసుకుని సంచలన నమోదు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. మరోవైపు అసలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ కబళిస్తుందని టీడీపీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలో రాజశేఖరరెడ్డి కూడా ఆపరేషన్ ఆకర్ష పేరుతో టీడీపీని దెబ్బ తీశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులకు అప్పుడే బీజం పడింది. అయితే ఈ సారి ఆ ప్రమాదం కొంతవరకూ ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ పార్టీలు మారే వారు రాజీనామాలు చెయ్యాలి అని తరచు చెప్పే వారు. ఇప్పుడు వారితో రాజీనామా చేసి గెలిపించుకునే శక్తి అధికార పార్టీకి ఉన్నా వెంటవెంటనే ఖర్చు పెట్టే స్థోమత వారికి లేదు. దానికి తోడు ఎటుతిరిగి ఎటువచ్చినా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది.

దీనితో వారు కొంత కాలం వేచి చూసే అవకాశం ఉంది. టీడీపీలో గెలిచిన వారిలో చాలా మంది మటుకు పార్టీకి విధేయులే. దీనితో టీడీపీ కొంత కాలం ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే ఓడిపోయిన కీలక నేతలు మాత్రం అధికార పార్టీ అండ కోసం పార్టీ మారే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే వచ్చే ఐదు సంవత్సరాలు కీలకం కాబోతున్నాయి. ఈ కష్టకాలం నుండి చంద్రబాబు పార్టీని ఎలా గట్టెక్కిస్తారు అనేది కార్యకర్తలకు కూడా అంతుచిక్కకుండానే ఉంది.