TDP-MLA-Manthena-Rama-Raju-ఏలూరు జిల్లా, ఉండి మండలంలోని ఉప్పులూరులో టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధ్వర్యంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు గ్రామంలో జరుగుతున్న సంతలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వ్యాపారులతో మాట్లాడి జగన్ ప్రభుత్వం పనితీరు గురించి అభిప్రాయం అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తోంది తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం నియోజకవర్గం స్థాయిలో సమస్యలను కూడా పరిష్కరించలేకపోతోంది,” అని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జుత్తుగా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మోపిదేవి శ్రీను, ఉపాధ్యక్షుడు గురుగుబిల్లి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు పొత్తూరి వేంకటేశ్వర రాజు, టిడిపి నేత కరిమెరక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు పట్టణంలో 30వ వార్డులో పట్టణ టిడిపి అధ్యక్షుడు గండేటి వేంకటేశ్వర రావు అధ్వర్యంలో శుక్రవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు గండేటి వేంకటేశ్వర రావు ప్రసంగిస్తూ, “విద్యుత్ కోతలు విధిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తోంది. పట్టణంలో వీధిలైట్లు వెలగకపోయినా వాటి పేరు చెప్పుకొని జగన్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోంది. ఊరిని పరిశుభ్రంగా ఉంచలేకపోయినా చెత్తపన్ను వసూలు చేస్తోంది. రోడ్లు మరమత్తులు చేయకపోయినా ఇంటిపన్ను పెంచేస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంకా ఇంపాక్ట్ పన్ను, ట్రూఅప్ బాదుడు అంటూ ప్రజలను బాదేసేందుకు సిద్దం అవుతోంది. కనుక వైసీపీ నేతలు చెప్పే మాయమాటలు గుడ్డిగా నమ్మి మళ్ళీ మరో ఛాన్స్ ఇవ్వొద్దని అందరినీ కోరుతున్నాను,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధనాని సూర్యప్రకాష్, వార్డు అధ్యక్షుడు చిప్పాడ రుష్యేంద్ర కుమార్, కార్యదర్శి కడసారపు శ్రీను, టిడిపి నాయకులు బందెల భాస్కరరావు, కవురు ముత్యాలరావు, రామారావు, అన్నవరం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.