MLA Chintamaneni Prabhakar sentenced to six months in jailరెబెల్ ఎమ్మెల్యేగా సుపరిచితమైన దెందులూరు తెలుగు దేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురైయింది. 2011లో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్న కేసులో ఆయనకు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష మరియు 5 వేల రూపాయిల జరిమాన విధించింది.

వివరాల్లోకి వెళ్తే 2011లో ఒక ప్రభుత్వ మీటింగ్లో తనని అవమానించినందుకు అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్‌ చేయి చేసుకున్నారు. అదే సమయంలో అప్పటి ఎంపీ కావూరి సాంబశివరావుపైనా ఘర్షణకు దిగారు. అయితే ఈ వ్యవహారంపై వట్టి వసంత్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ కేసు విచారణ ఇప్పటికి పూర్తయ్యింది. విచారణ జరిపిన భీమడోలు మెజిస్ట్రేట్‌ కోర్టు చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించింది. కోర్టు తీర్పుపై ఎమ్మెల్యే పై కోర్టుకు వెళ్లే పనిలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్ గా కూడా ఉన్నారు.