TDP Leaders sattire on Pawan Kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారా? ఆయన ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు అదే అంటున్నారు. తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ … తాను అండగా లేకపోతే తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో కేవలం 39 సీట్లే వచ్చేవని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ఎన్నికలలో టీడీపీకి 103 స్థానాలు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ సపోర్టు వల్ల ఏకంగా 64 సీట్లు ఎక్కువగా వచ్చాయట.

మరి అప్పటి ప్రజారాజ్యం పార్టీకి అంత కృషి చేసినా 18 సీట్లే ఎందుకు వచ్చాయని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలపై ఆ ప్రాంతవాసులు దాడులకు పాల్పడుతుంటే చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారు. జగన్‌ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆ కష్టకాలంలో తెలంగాణలోని ఆంధ్ర ప్రజలకు నేనే అండగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం జరుగతుండగా పవన్ కళ్యాణ్ ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు.

అదే మాదిరిగా ఆయన సొంత సినిమా విడుదలకు ఇబ్బంది వచ్చినా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడలేదు. మరి ఆయన ఆంధ్ర ప్రజలకు ఎలా అండగా ఉన్నారో? కనీసం రాష్ట్రం విడిపోయాకా కూడా రెండు రాష్ట్రాల మధ్యా అనేక వివాదాలు వచ్చినా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కలిపించుకోలేదు. ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్ పై ఒకటి రెండు మాటలు అనడం తప్ప. ఆ తరువాత తెరాస వారితో కంప్రమైజ్ అయిపోయి కేసీఆర్ కేటీఆర్ తో ఫోటోలు, సెల్ఫీలు తీయించుకున్నారు. పవన్ కళ్యాణ్ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారు.