Chintamaneni Prabhakarదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రభుత్వం పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైలుకి పంపిన సంగతి తెలిసింది. ఒక కేసులో బెయిలు వస్తుంది అనగా ఇంకో కేసు కట్టి రేమండ్ పెంచుకుంటూ పోయారు. 66 రోజులు జైలులో గడిపాక బెయిలు మీద విడుదలయ్యారు ఆయన. అయితే విడుదలైన రోజే ఆయన పై ఇంకో కేసు పెట్టింది ప్రభుత్వం.

పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌తో పాటూ మరికొందరు అనుచరులపైనా కేసు ఫైలయ్యింది. శనివారం ఏలూరు జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్.. జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకున్నారు. భారీగా ప్రజలు ఆయనను చూడటానికి తరలి వచ్చారు.

కానీ పశ్చిమగోదారవి జిల్లాలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉందని.. చింతమనేని ప్రభాకర్‌ ర్యాలీగా వస్తూ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతుందని చింతమనేని అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… “జైలుకు వెళ్లిన రాజకీయ నాయకులు నష్టపోయినట్టు చరిత్రలో లేదు. ప్రత్యక్ష ఉదాహరణ జగనే. ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టి చింతమనేనిని వేధిస్తున్నారని ప్రజలు అనుకుంటే ఆయనను వచ్చే ఎన్నికలలో గెలిపించడం ఖాయం,” అని చెప్పుకొచ్చారు.