Chandrababu-Naidu's-Extreme-Confidence-Surprises-Opponentsఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలోని రెండు ఎమ్మెల్యే సీట్లు 2014 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ తరువాత ఆ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మళ్ళీ పోటీ చేస్తుండగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కన్ను మూయడంతో ఆయన కుమారుడు మంత్రి శ్రావణ్ టీడీపీ తరపు నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలోకి రావడంతో ఆయన అరకు ఎంపీకి పోటీ చేస్తున్నారు. వీరి ముగ్గురితో టీడీపీ ఏజెన్సీ ఏరియా లో పటిష్టంగా కనిపిస్తుంది.

గిరిజనులే టార్గెట్ గా చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వారికి వచ్చే పెన్షన్ కనీస వయసును 50 ఏళ్లకు కుదించారు. ప్రతి ఇంటికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఎన్టీఆర్ గృహాలకు 75000 అదనపు సాయం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, విదేశీ విద్యకు సాయం, స్కాలర్ షిప్లు భారీగా పెంచడం వంటి పథకాలు గిరిపుత్రులు బాగా ఉపయోగపడ్డాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దత్తతు తీసుకోవడంతో ప్రభుత్వం తమను పట్టించుకుంటుంది అని వారికి అభిప్రాయం కలిగించారు.

గిడ్డి ఈశ్వరికి స్థానికంగా మంచి పేరు ఉండటం, శ్రావణ్ కు తండ్రిని కోల్పోయాడన్న సింపతీ కూడా బాగా పనికి వస్తుంది. శ్రావణ్ ను చివరి నిముషంలో మంత్రిని చెయ్యడం, నియోజకవర్గాలకు విరివిగా నిధులు విడుదల చెయ్యడంతో అక్కడ టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. కిషోర్ చంద్రదేవ్ కు ఇక్కడ ఉన్న పరిచయాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉపకరిస్తున్నాయి. దీనితో ఈ సారి ఏజెన్సీలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు.