Kotla Jayasurya Prakasha Reddy to Meet Chandrababu Naiduమాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడంపై పునరాలోచన చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల తాము అడిగిన సీట్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడంపై ఆలోచన పడ్డారట. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి టీడీపీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు.దీనితో అప్రమత్తమైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఆయనతో చర్చలు మొదలు పెట్టింది.

“వైఎస్సాఆర్ కాంగ్రెస్, టీడీపీ నేతల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. పార్టీలో చేరమని ఆహ్వానాలు పలుకుతున్నారు. అధికార పార్టీ కాబట్టి కొన్ని డిమాండ్లతో టీడీపీ వైపు మొగ్గు చుపాను. టీడీపీలో నేను చేరానన్నది అబద్ధం. పత్రికల్లో కొందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేశారు. రైతులు, నా కార్యకర్తల కోసం ఎల్ఎల్సీ, వేదవతి, గుండ్రేవుల, ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తే నేను టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను” అని కోట్ల స్పష్టం చేశారు.

ఆయన రేపు టీడీపీలో చేరతారని వార్తలు వచ్చిన క్రమంలో కోట్ల ఇలా యూటర్న్ తీసుకోవడంతో ఒకింత అభిమానులు, కార్యకర్తలు సైతం కంగుతిన్నారని తెలుస్తోంది. కోట్ల ఆఖరికి ఏ పార్టీలో చేరతారు..? ఆయన డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు పనులకు టీడీపీ నుంచి స్పందన వస్తుందా..? లేదా? లేకుంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. కోట్ల డిమాండ్లు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోలేని పరిస్థితి అని తెలుస్తుంది.