TDP-Karanam-Balaram2014 ఎన్నికలలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరామ్ పోటీ చెయ్యలేదు. ఆయన కుమారుడు వెంకటేష్ కు అద్దంకి సీటు ఇచ్చారు చంద్రబాబు. అయితే వెంకటేష్ ఓడిపోయారు. కరణంకు 2012లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే వెంకటేష్ మీద గెలిచిన వైకాపా అభ్యర్థి గొట్టిపాటి రవిని టీడీపీలోకి తీసుకుని రావడం ఆయనకు ఎంతమాత్రం రుచించలేదు. దీనితో చాలా కాలం ఆయన అసంతృప్త వాదిగానే ఉండిపోయారు. చంద్రబాబు వారిద్దరి మధ్యా రాజీ కుదిర్చి ఈ సారి చీరాల టిక్కెట్ ఇచ్చారు బలరామ్ కు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో ఇక్కడ పార్టీకి బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. కరణం చీరాల వెళ్ళాక అక్కడి పరిస్థితిలు వేగంగా మారిపోయాయి. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన. 2009 నుండి ఆమంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన మీద వ్యతిరేకత ఉంది. దానిని సరిగ్గా వాడుకుంటున్నారు బలరామ్. ఈ సారి ఈ సీటు కొట్టడం ఖాయమని తెలుగుదేశం వర్గాలు ధీమాగా ఉన్నాయి.

చీరాలలో వ్యాశ్యులు ఎక్కువ. ఆ సామాజికవర్గం వారు ఆరాధించే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మద్దతు ఆమంచి కృష్ణమోహన్ కు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. దానికి తోడు ఆమంచి చివరి నిముషం పోల్ మానేజ్మెంట్ లో దిట్ట. ఈ కారణంగానే ఆయన 2014లో ఊరూ పేరు లేని నవోదయ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన వైకాపా లాంటి బలమైన పార్టీ అండ కూడా ఉండటంతో ఆయనకు అక్కడ ఓడించడం అంత తేలిక ఏమీ కాదని, హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకుల అభిప్రాయం.