TDP--Kapu-Reservationsటీడీపీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న కాపు రిజర్వేషన్ల సమస్య తీర్చింది. కాపులకు 5% రిజర్వేషన్లు ఇచ్చి బిల్ పాస్ చేసి కేంద్ర ఆమోదం కోసం పంపారు. రిజర్వేషన్లు 50% దాటడంతో కేంద్రం నిర్ణయం అనివార్యం. వారి నిర్ణయం ఎలా ఉంటాదో తెలీదుగానీ చంద్రబాబు తాను చేయాల్సిందంతా చేశారనే అనుకోవాలి.

అయితే 2019 ఎన్నికలలో కాపులు ఎటు చూస్తారో చూడాలి. న్యాయంగా అయితే వారి ఓట్లు గంపగుత్తుగా టీడీపీకి పడాలి. అయితే రాజకీయాలలో 1+1 అనేది 2 అవ్వాలని లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా పోటీ చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. కాపులు ఆయనను కాదని చంద్రబాబుకు ఓటు వేస్తారా అనేది అసలైన ప్రశ్న.

మరో వైపు ఈ రిజర్వేషన్ల గొడవ బీజేపీకు తలపోటుగా తయారు కాబోతుంది. చంద్రబాబు ఈ విషయాన్నీ కేంద్ర కోర్టులో వేశారు. దీనిపై బీజేపీది కక్కలేక మింగలేని పరిస్థితి. ఇవ్వకపోతే కాపులతో తలపోటు. అదే సమయంలో ఇస్తే వేరే రాష్ట్రాల్లో జాట్లు, పటేళ్ల తో గొడవ. దీనిపై ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాదో చూడాలి మరి.

మరోవైపు రిజర్వేషన్లు పెంచడంతో అగ్రవర్ణాల వారికి నిస్తేజం ఆవహించింది. అగ్రవర్ణాలన్నింటిలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్న వారికి ఎనిమిది శాతం రిజర్వేషను ఇవ్వాలని సిఫార్సు చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు సమాచారం. దీని వాళ్ళ కులాలకతీతంగా పేదలందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు సమాచారం.