నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో 17వ వార్డులో నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే దీవి శివరాం నేతృత్వంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కల్లూరి శైలజ, ఎన్వీ సుబ్బారావు, తానికొండ ప్రవీణ్, దీవి కోటేశ్వరరావు, రాయి వెంకటేశ్వర్లు, ఎం రామారావు, రామలింగయ్య, చేకూరి కృష్ణ, వీరస్వామి, ముచ్చు శ్రీను తదితరులు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం బ్యానర్‌తో ర్యాలీలో పాల్గొని వార్డులో ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలు పంచారు.
ఈ సందర్భంగా టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వర రావు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వారం నుంచే అప్పులు చేయడం మొదలుపెట్టి ఈ మూడేళ్ళలో లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసింది. రాష్ట్రంలో అభివృద్ధి మాటే లేదు. జగన్ ప్రభుత్వ తీరు చూసి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన గుంతలు పడిన రోడ్లు, జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తప్ప మారేవీ కనబడటం లేదు.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం కులాల మద్య చిచ్చుపెడుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పచ్చటి కోనసీమలో జరిగిన అల్లర్లే ఇందుకు నిదర్శనం. కనుక వైసీపీ బారి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకొని, మళ్ళీ గాడిన పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి లేకుంటే మున్ముందు రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు రావచ్చు,” అని అన్నారు.