ఏపీ రాజకీయాలలో ‘బూతుల మంత్రి’గా కీర్తించబడుతున్న కొడాలి నాని పెదవి విప్పితే వచ్చే మాటల గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడుపై నిత్యం విరుచుకుపడే కొడాలి, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను తానే తిట్టుకున్నారు.

‘నేను ఒక సన్నాసి, వెధవ’ అంటూ తనను తానే దూషించుకున్న కొడాలి నాని వ్యాఖ్యలను షేర్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సాధారణంగా కొడాలి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం చేసే టిడిపి నేతలు, మొదటిసారిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘నేను ఒక సన్నాసి, వెధవ. వంశీ, నేను అలాంటి పనులు చేసే వైసీపీలో చేరాం. ఆ పార్టీ నాయకత్వం మేము తీసుకోలేదు. జగన్ మోహన్ రెడ్డి గారి పక్కన ఏదొక మూలన పడుంటున్నాము’ అన్న కొడాలి వీడియో హల్చల్ చేస్తోంది.

కొడాలి నానికి నోరు జారడం అనేది కొత్తేమీ కాదు. ఇటీవల ‘ముఖ్యమంత్రి గాడు’ అని టంగ్ స్లిప్ అయిన నాని, తర్వాత సవరించుకుని ‘ముఖ్యమంత్రి గారు’ అని అన్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రకంగా చక్కర్లు కొడుతూనే ఉంటారు కొడాలి.