TDP fans trolls pawan kalyan staminaనిన్న విజయనగరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన కు వడదెబ్బ తగలడంతో డీహైడ్రేషన్ కు గురయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో వస్తుండగా అనారోగ్యంగా ,నీరసంగా కనిపించారు. వెంటనే ఎయిర్‌పోర్టులో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆయుష్‌ ఆస్పత్రికి పవన్‌ వెళ్లగా, అక్కడ ఐసీయూలో చికిత్స అందించి, రాత్రికి డిశ్చార్చి చేశారు.

అయితే దీనిపై తెలుగుదేశం సోషల్ మీడియా అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేశారు. ఇటీవలే తన ఎన్నికల మీటింగులలో పవన్ కళ్యాణ్ తరచుగా చంద్రబాబు కు వయసు అయిపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేస్తున్నారు. 70వ పడిలో చంద్రబాబు రోజుకు అరడజన్ సభలకు హాజరు అవుతున్నారు, నీవు గట్టిగా రోజుకు రెండు సభలకు వెళ్ళి వడదెబ్బ అంటూ మంచం ఎక్కవు అంటూ వారు పవన్ ను ఎగతాళి చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు దగ్గర దగ్గర 100 ఎన్నికల సభలకు హాజరు అయ్యారు. అదే సమయంలో జగన్ గానీ పవన్ కళ్యాణ్ గానీ 50 మార్కుకు అటూ ఇటుగా ఉంటున్నారు. మీరా ఆయన వయసు గురించీ స్టామినా గురించి మాట్లాడేది అంటున్నారు వారు. ఈ నెల 9వ తారీఖుతో ప్రచారం గడువు ముగిసిపోతుంది. 11న పోలింగ్ జరగబోతుంది. రాజకీయ పార్టీల నాయకుల భవితవ్యం గురించి తెలియాలంటే మే 23వరకు ఆగాలసిందే. అంటే దాదాపుగా నెలన్నర సమయం అన్నమాట.