Sujana Chowdary-TDP Rajya Sabhaరాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థి ఎంపిక టీడీపీని ఇరుకున పెట్టె అవకాశం కనిపిస్తుంది. ఎన్డీయేను విబేధిస్తున్న కారణంగా ప్రతిపక్షాల అభ్యర్ధికి ఓటు వెయ్యాలని ఆ పార్టీ ముందుగానే నిర్ణయించింది. అయితే మొదట కాంగ్రెస్సేతర అభ్యర్థి ఉండవచ్చని భావించినా చివరకు కాంగ్రెస్ అభ్యర్థినే ఉండబోతున్నారు.

అయితే కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేస్తే టీడీపీకి కొత్త ఇబ్బందులు రావొచ్చు. రాష్ట్ర విభజన చేసిన పార్టీకి ఓటు ఎలా వేస్తారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. ఎన్నికను బహిష్కరించినా అది బీజేపీకి లాభం చేకూర్చేదే కాబట్టి ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైకాపా ఏం చేస్తుందో కూడా చూడాల్సి ఉంది.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నట్లు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం రాజ్యసభలో ప్రకటించిన సంగతి విదితమే. ఈ రోజుతో నామినేషన్లకు గడువు ముగుస్తోంది. భాజపా వైఖరిపై మిత్రపక్షాలైన శివసేన, శిరోమణి అకాలీదళ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా జేడీయూ ఎంపీని ప్రకటించారని రెండు పార్టీలూ కినుక వహించాయి. అయినా శివసేన, అకాలీదళ్‌ ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేస్తాయని నమ్ముతున్నారు బీజేపీ వారు.