<TDP---Congress-Alliance-Sonia-Gandhi-AP-Special-Status
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రాష్ట్రానికి తొలిసారిగా వచ్చారు. ఎన్నికల తరుణంలో సోనియాగాంధీ తెలంగాణ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేడ్చల్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆవిడ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆవిడ చేసిన ఒక ప్రకటన సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. “నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి ఈ స్టేజ్ నుంచి వాగ్దానం చేస్తున్నా .. స్పెషల్ స్టేటస్ తో పాటు మేము అన్ని మేము చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాం, అని ఆవిడ ప్రకటించారు.

ఒకరకంగా ఈ ప్రకటన చంద్రబాబు నాయుడు చేతికి ఆమె వజ్రాయుధం ఇచ్చినట్టే. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక అంశము కాబోతోంది. దేశంలో ప్రత్యేక హోదా ఇవ్వగల్గింది బీజేపీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ ఇవ్వొద్దని ఇప్పటికే తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే ఉన్న ఒకే ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. ప్రజలకు ఈ విషయం చెప్పే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్తారు. మనకు కాంగ్రెస్ ను నమ్మక తప్పని పరిస్థితి అని ఆయన చెబుతారు.

ఈ ప్రకటనతో కాంగ్రెస్ ఎంతోకొంత బలపడితే అది టీడీపీ కి కూడా లాభమే. మరోవైపు ఈ ప్రకటన తో హైదరాబాద్ లోని సెట్టలేర్లు మహాకూటమి వైపు చూసే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని వివిధ సర్వేలు చెబుతున్న తరుణంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సీట్లేర్ల ప్రభావం ఎక్కువ ఉండే సీట్లు కీలకం కానున్నాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ చేసిన ప్రకటన మహాకూటమికు ఉపయోగ పడే అవకాశాలు చాలా ఎక్కువ. డిసెంబర్ 7న తెలంగాణ లో ఎన్నికలు జరగబోతున్నాయి అదే నెల 11న ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీడీపీ, కాంగ్రెస్ లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కాబోతున్నా