Chandrababu -Naiduచంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో అగ్రగామిగా ఉండేది. వరుసగా రెండు మూడేళ్లు ప్రధమ స్థానంలో నిలిచింది. అయితే అప్పట్లో ఆ ఘనత గురించి చంద్రబాబుకు సరిగా చెప్పుకోవడం కుదరలేదు. ఆ టైం లో అప్పటి ప్రతిపక్షం, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అదేమంత పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడేది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్విట్టర్ లో ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో అగ్రగామి అంటూ పేర్కొంది. దీనితో జగన్ మార్కు గవర్నెన్స్ అని, రాజన్న రాజ్యమని, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు స్వర్గధామమని ప్రపంచానికి చాటి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ డిజిటల్ సేన రంగంలోకి దిగిపోయింది.

అయితే ఏ ట్వీట్ అయితే వారు వైరల్ చేస్తున్నారో అందులో ఒక లింక్ కూడా ఉంది. అది ఓపెన్ చేస్తే ఈ ఘనత 2018-19 సమయంలోనిది అని స్పష్టంగా ఉంది. అంటే చంద్రబాబు ఘనతను జగన్ ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతుంది. మరో వైపు కేంద్రప్రభుత్వం తరపున ఇచ్చే ఈ ర్యాంకింగ్స్ 2019-2020 అంటే దాదాపుగా జగన్ పాలనకు ఇప్పటివరకు కసరత్తు పూర్తి చెయ్యలేదు.

పీపీఏల సమీక్ష, కొన్ని పాత ప్రోజెక్టులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను తిరిగి తీసుకోవడం వంటి వాటితో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం దక్కించుకోవడం కష్టమే అని నిపుణులు అంటున్నారు. సరే అప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం దక్కింది అనేది మాత్రం నిజం కాదు.