TDP becoming zero in Telangana State2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో పదిహేను సీట్లు గెలుచుకున్న తెలుగుదేశంపార్టీ గట్టిగానే నిలబడాలని ఆ తర్వాత ప్రయత్నాలు చేసింది. కాని కేసీఆర్ ఆపరేషన్ మాస్టర్ ప్లాన్తో మొత్తం పరిస్థితి మారిపోయింది. టిడిపి నుంచి ఒక్కొక్కరుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిపోయారు.

బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య పార్టీతో అంటీ,అంటనట్లే ఉంటారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే ఆ పార్టీలో ఏక్టీవ్ గా ఉంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రాజీనామాతో పరిస్తితి మళ్లీ ముందుకు వచ్చింది. సండ్ర వెంకట వీరయ్య అధికార పార్టీనా, లేదా కాంగ్రెసా అనేది ఇంకా తేల్చుకోలేక పోతున్నారట.

మరో వైపు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరాలని అటువైపు నుంచి ఒత్తిడి వస్తోందట.ఆయన ఏ నిర్ణయం ఇంకా చేసుకోలేకపోతున్నారు. దీనితో తెలంగాణా అసెంబ్లీ లో తెలంగాణా టిడిపి కౌంట్ జీరో అవుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి తెలంగాణా కౌన్సిల్ లో ప్రాతినిధ్యం లేదు.