TDP and Jenasena Alligations on Cheap Liquorపశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో 18 మంది ప్రజల మరణానికి కారణమైన కల్తీ మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ రెండు రోజులు రాష్ట్రమంతా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంగాను రాష్ట్రంలో పలు చోట్ల ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాల ఎదుట ‘జే’ బ్రాండ్లకు సంబంధించిన మద్యం బాటిల్స్ ని కొనుగోలు చేసి వాటిని పగలగొట్టి టీడీపీ మహిళా నేతలు తమ నిరసనను తెలియజేసారు.

టీడీపీ ముఖ్యనేతలైన బుద్ధా వెంకన్న., నిమ్మల రామానాయుడు., గోరంట్ల బుచ్చయ్యచౌదరి., అయ్యన్న మరికొంతమంది టీడీపీ నాయకులు తమ సోషల్ మీడియాలలో కూడా ఈ మద్యం మరణాలను ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిలదీసారు. “అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం చేసాడు ఈ ముఖ్యమంత్రి., జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి చేశాయి., మహిళల మాంగల్యాలను తెంచే ఈ జే బ్రాండ్లు పోవాలి… ప్రజల ప్రాణాలు నిలవాలి..!” అంటూ టీడీపీ నాయకుడు నిమ్మల రామానాయుడు కార్యకర్తలతో సహా నిరసన ర్యాలీలు చేశారు.

నాటు సారా కంటే ప్రమాదకరమైన లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలపై చిల్లర ఏరుకుంటున్న నత్తి పకోడీ, జ్యూమాంజి మద్యపాన నిషేధం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం సూపర్., ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని పిలుస్తున్న నత్తి పకోడీ ., ఈ బ్రాండ్ల మద్యాన్నే జ్యూమాంజీల గొంతులో పోస్తే రాష్ట్రానికి పట్టిన పీడా పోతుంది అని అయ్యన్న తనదైన స్టైల్ లో ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీలిచ్చి., అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేధించి, జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ దొరకని ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజలు ప్రాణాలను హరిస్తున్న ఈ జగన్ ప్రభుత్వం రానున్న రోజులలో ఏపీలో నిషేధించబడింది తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. ‘జగన్ మాటలకు అర్ధాలు వేరయా’ అని జనసేన అధినేత పవన్ చెపుతూనే ఉంటారు ఇందుకే కాబోలు.