TDP and BJP Allianceటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అపార చాణిక్యుడిగా కీర్తింపబడతారు. ఆయన చేసే ప్రతి పని వెనుక ఆ పార్టీ యొక్క విస్తృత రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. టీడీపీకు సపోర్ట్ చేసే పత్రికలు – ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి ద్వారా అవి బయటపెడుతూ ఉంటారు అవసరం అనుకునప్పుడల్లా.

ఇటీవలే కాలంలో ఉన్నటుంది ఆ పత్రికలలో బీజేపీ వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ పవర్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ఎలా అన్యాయం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కేంద్రం పై చంద్రబాబు తన వైఖరి మార్చుకోనున్నారని అర్ధం అవుతుంది.

అందుకు తగ్గట్టుగానే ఆ పత్రికలు ప్రజలని సిద్ధం చేస్తున్నాయి అనే అనుకోవాలి. చంద్రబాబు మార్క్ రాజకీయం తెలిసిన వాళ్ళకి ఇవన్నీ చాలా ఈజీ గా అర్ధం అవుతాది. 2019 ఎన్నికలు దగ్గర్లో ఉన్న కారణంగా టీడీపీ బీజేపీ కటీఫ్ చెప్పడానికి సిద్ధం అవుతుందా అనే అనుమానం రాక మానదు. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు అనేది చూడాలి.

బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని చంద్రబాబు మరియు ప్రజల యొక్క విస్తృత అభిప్రాయం. అయితే కేంద్రంతో సఖ్యతతో మెలగకపోతే రాష్ట్రం పై మరింత కక్ష సాధింపు చర్యలు ఉంటాయని జడిసి చంద్రబాబు ఇప్పటిదాకా ఇవన్నీ మౌనంగానే భరించారు. అయితే ఎన్నికల తరుణంలో తాడోపేడో తేల్చుకోకపోతే బీజేపీతో పాటు టీడీపీ కూడా మునిగిపోవాలి.