TDP allegations anna canteens to replace govt liquor shopsతెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నా క్యాంటీన్లు మూత పడ్డాయి. పేదలకు నామమాత్రపు ధరలకు కడుపు నింపే ఈ క్యాంటీన్లకు తాళాలు వేశారు. ప్రభుత్వానికి మూసి వేసే ఆలోచన లేదని, కొన్ని మార్పులు చేర్పులతో మళ్ళీ ఓపెన్ చేస్తామని మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పుకొచ్చారు. మరో వైపు మంత్రి ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాంటీన్లు నడపడానికి బిల్డింగులు అవసరం లేదని, సంచార కాంటీన్లు గా నడిపితే మరింత మందికి లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ప్రభుత్వం అన్నా కాంటీన్ల బిల్డింగుల మీద కన్నేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం సర్కారీ వైన్ షాపులు నడపడానికి సిద్ధం అవుతుంది. వీటి కోసం బిల్డింగ్లు కావాలి. సొంతంగా లేదా అద్దెకు వీటిని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అన్నా కాంటీన్ల బిల్డింగులు మీద కన్నువేశారు. అన్నం పెట్టిన చోట మందు అమ్మితే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ప్రభుత్వం అందుకోసమే అన్న కాంటీన్లను మూసి వేసింది,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.

అయితే అన్నా కాంటీన్ల బిల్డింగులలో మందు షాపులు ఓపెన్ చేస్తే ఎదురయ్యే పర్యవసానాలు ఏంటో ప్రభుత్వానికి తెలియకుండా ఏమీ ఉండదు. దీనితో దీనిని ప్రస్తుతానికి రాజకీయ విమర్శగానే చూడాలి. ఇది ఇలా ఉండగా కాంటీన్ల మీద టీడీపీ మార్కు పోవడం కోసమని ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టి కాంటీన్ల రంగులు మారుస్తుంది. ప్రస్తుతానికి ఈ బిల్డింగులకు తెల్ల రంగు వేయించారు. అవసరాన్ని బట్టి తరువాతి కాలంలో రంగులు మారుస్తారని సమాచారం.