Chandrababu -Naidu ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మూడు బడా ఇన్ఫ్రా కంపెనీలతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ ని కూడా రైడ్ చేశారని ఆ ప్రకటన సారంశం.

అయితే ఒక సెక్షన్ తెలుగు మీడియా మాత్రం ఆ రెండు వేల కోట్లు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వద్దే దొరికాయాని గట్టిగా ప్రచారం చేస్తుంది. ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు ఇచ్చిన ప్రెస్ నోట్ కూడా కావాలనే చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి గందరగోళంగా రాశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా టీడీపీ ఈ పుకార్లను ఎదురుకోవడానికి తిప్పలు పడుతుంది. ఏం జరిగింది అనే దానిపై టీడీపీ పక్షాలు చెబుతున్న, మీడియా ప్రచారం, వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడితో రాజకీయంగా ఇబ్బందిగానే ఉంది. ఈ కేసులో ఇంకో కొసమెరుపు ఏమిటంటే… సదరు పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి.

జీఏడీ డిపార్టుమెంటులో పనిచేస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయన బయటకు వచ్చి మాట్లాడటం కుదరదు. ఇన్కమ్ టాక్స్ డిపార్మెంటు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు… రాజకీయంగా ఇవ్వనివ్వరు కూడా. దీనితో టీడీపీని చక్రబంధనం చేసినట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇది ఎవరి పని? ఎవరు చేయించారు అనేదానిమీద టీడీపీ వారికి పెద్దగా సంశయాలు లేవు.