Taxiwala Success Meet Bheemavaramసినిమా అంటే కష్టం…సినిమా అంటే ఇష్టం..సినిమా అంటే సర్వం…ఇదే ట్యాక్సీ వాలా అని అనుకున్నాం అందరం. కానీ అసలు ఈ సినిమా ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని బాధలను తనలోనే దాచుకుందో? ఎంత నొప్పిని భరించి బయట పడిందో మనసు విప్పి చెప్పేశాడు మన రౌడీ సీఎం విజయ్ దేవరకొండ.

వాళ్ళు సినిమా మొదలు పెట్టినప్పటినుంచీ చాలా ఇబ్బందులు పడ్డారట. అందరూ కొత్తవారు అని భయపడ్డారట తొలుత, కొన్నాళ్ళ తర్వాత సీజీ (కంప్యూటర్ గ్ర్యాఫిక్స్) సరిగ్గా లేదు ఆపి వేసి, కాస్త గ్యాప్ తీసుకుని తీద్దాము అంటూ ఆపేశారట. అయితే ఈలోపు విజయ్ పై వచ్చిన రూమర్స్ కి వరుస సినిమాలతో సమాధానం చెప్తూనే, మరో పక్క మళ్లీ సినిమా మొదలు పెట్టాడట. అన్నీ వెరసి సినిమా దాదాపుగా పూర్తి అవుతుంది అని తెలియవచ్చేసరికి. ఇంట్లో ఉన్న ఆడపిల్లను దొంగోడు ఎత్తుకెళ్లినట్లు. కొందరు పైరసీ బ్యాచ్ సినిమాను నెట్ లో పెట్టేసింది. ఇంకేం ఉంది అంతా అయిపోయింది అని అనుకున్నవారంతా ప్రేక్షకులను నమ్మి ఒరిజినల్, సర్టిఫైడ్ కాపీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే, బ్లాక్ బష్టర్ హిట్ చేసి చరిత్ర సృష్టించారు అంటూ తన మనసు విప్పి చెప్పాడు మన విజయ్. మరో పక్క సినిమా హీరోలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సినిమా వాళ్ళది అని కాకుండా అందరూ ఒక్కటే అని, ప్రిన్స్ మహేష్ బాబు, రామ్‌చరణ్, తనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్, ఇలా ఇండస్ట్రీ అంతా ట్వీట్స్ చేసి తనవైపే ఉంది అన్న భరోసా దొరకడంతో, సినిమా కుటుంభం అంతా ఒక్కటే అని మరోసారి అనిపించిందట విజయ్ కి.

అయితే నిజమే అంతగా లోతులో కూరుకుపోయిన సినిమా ఇంతటి ఘన విజయం సాధిచడం అంటే, బహుశా ఇది ఒక ప్రభంజనంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా సంధర్భమే అని చెప్పాలి. ఇక తమ సినిమా పురిటి నొప్పుల నుంచి విజయ దరహాసం చిందించడానికి అసలు కారణం అయిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు విజయ్.! మొత్తంగా అతి తక్కువ వ్యవధిలోనే ఎంతో అనుభవం సంపాదించుకున్నాడు ఏ కుర్ర హీరో.