ఫ్లాష్ ఫ్లాష్… “టాక్సీవాలా” మూవీ కూడా లీక్?

Taxiwala-movie -Leakటాలీవుడ్ లో లీకుల పర్వం కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 15వ తేదీన విడుదల కాబోతున్న “గీత గోవిందం” సినిమాలోని పలు సన్నివేశాలతో పాటు సినిమా మొత్తం పెన్ డ్రైవ్ లలో సర్క్యూలేట్ అవుతోందన్న సమాచారం హీరో విజయ్ దేవరకొండకు కన్నీరు తెప్పించగా, తాజాగా అదే హీరో నటించిన “టాక్సీవాలా” సినిమా కూడా పూర్తిగా లీక్ అయ్యిందన్న సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అంతేకాదు దీనికి సాక్ష్యంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ ఎడిటెడ్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. హెచ్.డి.క్వాలిటీ ఉన్న ఈ పిక్స్ లో హీరో విజయ్ దేవరకొండతో పాటు మరో ఇద్దరు కమెడియన్లు ఉన్నారు. ఈ లీకుల పర్వంతో ఒక్కసారిగా తాను డౌన్ అయిపోయానని దేవరకొండ ట్విట్టర్ వేదికగా కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే కోపం కూడా వస్తోందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు.

“గీత గోవిందం, టాక్సీవాలా” సినిమా లీకుల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు “అరవింద సమేత” సినిమాకు సంబంధించిన వీడియో, ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో ప్రధాన సూత్రధారి అయిన ఎడిటర్ ను అరెస్ట్ చేసారు. అయితే ఇలా ఒకదాని వెనుక మరొకటి లీకులు కావడం వెనుక టాలీవుడ్ పరిశ్రమ కృంగిపోతోంది. దీంతో నేడు జరగబోతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ ప్రసంగం ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Follow @mirchi9 for more User Comments
NTR-Mahanayakudu--TrailerDon't MissTrailer Talk: Flat – But to The PointThe theatrical trailer of the second part of the Nandamuri Taraka Ramarao biopic, Mahanayakudu is...YS-Jagan-Treads-Carefully-on--Jump-JilanisDon't MissJagan Treads Carefully on Jump JilanisMain Opposition Party, YSR Congress is seeing a mass exodus of TDP leaders in the...Allu Arjun Priya VarrierDon't MissWill Allu Arjun Lend a Chance to the Poor Girl?The hype that the wink created for Priya Prakash Varrier has unfortunately become a great...Pic Talk: Ruhi Singh, Can Bae Watch Be This Hot?Don't MissPic Talk: Can Bae Watch Be This Hot?This former Femina Miss India contest's contestant for 2012 has been making quite a number...Chandrababu Naidu Fans Counter to RGVDon't MissViral: Naidu Fans Counter to RGVWe all know how RGV made use of his favorite and the strongest weapon, Social...
Mirchi9