Taxiwala-First-Gear-Teaser-The-Beast-Vijay-Deverakonda-Is-Back‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో ప్రదర్శించిన యాటిట్యూడ్ తో యువతలో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న విజయ్, ఇటీవల విడుదలైన ‘ఏ మంత్రం వేసావే’ చిత్రంతో ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇది గతంలో ఒప్పుకున్న సినిమా కావడంతో, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను లైట్ గా తీసుకున్న పరిస్థితి.

తాజాగా ‘టాక్సీవాలా’ చిత్రం విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కు సరిగ్గా సరిపోయేలా ఉందన్న ఇంప్రెషన్ ను ‘ఫస్ట్ గేర్’ పేరుతో విడుదలైన వీడియో చెప్తోంది. కారు డ్రైవ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ హుషారులో ప్రేక్షకులకు ‘అర్జున్ రెడ్డి’ కనపడుతున్నాడు. ఇక యువీ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.