Taxiwaala-Teaser---Vijay-Deverakonda‘అర్జున్ రెడ్డి’తో పాపులర్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “టాక్సీవాలా.” ఇప్పటివరకు పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెప్పిన టైంకు కాస్త ఆలస్యంగా వచ్చింది గానీ, చూసిన ప్రేక్షకులను ఒక్క షాట్ లో కూడా నిరుత్సాహపరచదు.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కారు డ్రైవర్ గా విజయ్ దేవరకొండ నటించాడు. టీజర్ లో చూపించిన షాట్స్ తో ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్ ను మరో లెవల్ కు విజయ్ తీసుకెళ్తున్నట్లుగా కనపడుతోంది. యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్, జాక్స్ మేజోయ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లోని ఇతర హైలైట్స్.

ఈ సమ్మర్ లో మరో సెన్సేషనల్ మూవీగా “టాక్సీవాలా” సిద్ధమవుతోందన్న నమ్మకాన్ని టీజర్ కలిగించింది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జతగా ప్రియాంక అనే తెలుగు అమ్మాయి మరియు మాళవిక నాయర్ లు కనిపించనున్నారు. స్టోరీకి సంబంధించిన అంశాలేవీ రివీల్ చేయలేదు గానీ, ఓ చిన్న హింట్ అయితే ఇచ్చారు.